నవ్వుల ఆటంబాంబు లాంటి సినిమా ఎఫ్ 3 మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఉన్న పాత్రలు పాతవే అయినా అటు ఎంటర్టైన్మెంట్ మాత్రం కొత్తగా ఉంటుంది అని అనిల్ రావిపూడి చెప్పారు. అంతేకాదు ఇక ఎఫ్ 2 సినిమాకు ఎఫ్ 3 సినిమాకు అస్సలు సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కాగా ఇటీవలే విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ట్రైలర్ చూసిన తర్వాత ఈసారి కూడా అనిల్ రావిపూడి నవ్వుల సునామీ సృష్టించడం ఖాయమని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు.


 కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీబిజీగా ఉంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్ లతో పాటు మరో కీలకపాత్రలో సునీల్ ఎంట్రీ ఇచ్చాడు. అటు హీరోయిన్లుగా తమన్నా మెహరిన్ తో పాటు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఎంటర్టైన్మెంట్ ఈసారి డబుల్ అవుతోందని అంటున్నారు ప్రేక్షకులు. దీంతో ఇక ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడ చూసినా ఎఫ్ 3 చిత్రబృందం కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవలే  సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్  లో భాగంగా ఎఫ్ 3 సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కరోనా పాండమిక్ లో ఎఫ్ త్రీ ని స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చాడు. మూడువేవ్ లూ దాటుకుని మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఇటీవల ప్రివిలేజ్ వేడుకలు మాట్లాడుతూ ఆడియన్స్ ను నవ్వించడానికి ఎంతో కష్టపడ్డాం. అయితే మా ముందు ఉన్న పెద్ద శత్రువు ఎఫ్ 2. ఎందుకంటే ఎఫ్ 2 సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించింది.  ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వించాలి. అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయ్. అందుకే అంతకు మించి అని ఎంటర్టైన్మెంట్ అందించేందుకు చాలా కష్టపడి పని చేశాము. ఇక షూటింగ్ లో నన్ను భరించిన టీం కి కృతజ్ఞతలు అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: