అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవలే లవ్ స్టొరీ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నాగచైతన్య ఇప్పుడు తాజాగా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇక ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో" మనం" వంటి చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం "థాంక్యూ". అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమాని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.


కేవలం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ వంటి సినిమాలు అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతగా ఈ సినిమాకి ఉన్నారు. ఇక నాగచైతన్య సరసన రాసి ఖన్నా, మాళవిక నాయర్  నటించడం జరుగుతోంది. జూలై 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలియజేశారు. తాజాగా ఈ రోజున ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అభ్యర్థి తెలియజేశారు చిత్రబృందం.

అదేమిటంటే ఈ సినిమా టీజర్ ను ఈనెల 25వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఒక వీడియోను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఈ వీడియోలో నాగ చైతన్య తన పాత్రకు డబ్బింగ్ చెబుతూ ఉండగా విక్రమ్ కుమార్ వీడియో రికార్డు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక నాగచైతన్య రికార్డ్ ఎందుకు చేస్తున్నావ్ అని అడగగా.. సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నామని తెలియజేస్తారు. దాంతో ఒక్కసారిగా నాగచైతన్య షాక్ అవుతారు. నాగచైతన్య థాంక్యూ టీజర్ రిలీజ్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని అడగగా ఈ వీడియో అక్కడికి ముగిసిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: