మహేష్ బాబు తాజాగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించి విజయపథం తో దూసుకుపోతున్న ఈ సినిమా చూసి ఆయన మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని.. రాజమౌళి కూడా స్క్రిప్ట్ సిద్ధం చేసి పెట్టగా.. కథ మాత్రమే ఫైనల్ చేయాల్సి ఉందని.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  వెల్లడించారు. ఇక త్రివిక్రమ్  అనే  సినిమా విషయానికి వస్తే. గత ఏడాదే సినిమా షూటింగ్  మొదలు పెట్టాలని ఈ సినిమా ప్రస్తుతం వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ముఖ్యంగా మహేష్ బాబును ఒప్పించడానికి త్రివిక్రమ్ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఇక ప్రాజెక్టు స్క్రిప్ట్ అయితే నమ్మకంగా అనిపించే వరకు మహేష్ కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు .అందుకే మధ్యలో గ్యాప్  కూడా వచ్చినట్లు ఒక వార్త బాగా వైరల్ గా మారింది. ఎట్టకేలకు త్రివిక్రమ్ ఈ సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేసి మరో రెండు మూడు వారాల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇక  మహేష్ బాబు ప్రస్తుతం అమెరికా లో హాలిడే ట్రిప్ లో చాలా ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తిరిగి రాగానే త్రివిక్రమ్ ప్రాజెక్టును  వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా త్రివిక్రమ్ -  మహేష్ బాబు సినిమాకు మళ్లీ అదే టైటిల్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు అర్జున్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ కథ పరంగా అర్జునుడు అనే టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అర్జున్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు అదే టైటిల్ తో  వస్తున్న అర్జునుడు సినిమా ఎలాంటి విజయాన్ని పొందుతుందో అని ప్రేక్షకులు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: