సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న పాత్రను మరొకరితో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా జరగడానికి ప్రధాన కారణం...  మొదట ఒక కథలో ఒకరిని అనుకొని వారిని సంప్రదించగా,  ఆ సమయంలో వారికి ఆ కథ నచ్చకపోవడం వల్లో లేక , ఆ సమయంలో వారి డేట్ లు లేకపోవడం వల్లో కొందరు కొన్ని సినిమాలను వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసిన సినిమాలలో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తే, కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతూ కూడా ఉంటాయి.  

అయితే మంచి విజయాలు సాధించిన సందర్భంలో కొంత మంది ఆ సినిమాను ఎందుకు వదులుకున్నామ అని కాస్త బాధపడుతూ ఉంటారు.  ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే మెహరీన్ కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే... అల్లు అర్జున్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ హీరోయిన్ గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సరైనోడు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే. 

బ్లాక్ బస్టర్ మూవీ లో మెహరీన్ కు అవకాశం వచ్చిందట,  కాకపోతే కొన్ని కారణాల వల్ల సరైనోడు మూవీ ని మెహరీన్ రిజెక్ట్ చేసిందట.  అలా మెహరీన్ రిజెక్ట్ చేసిన సరైనోడు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ప్రస్తుతం సరైనోడు సినిమా చేసి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే మెహరిన్ 'కృష్ణగాడి వీరప్రేమ' గాధ ఈ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం మెహరీన్ ఎఫ్ 3 మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మే 27 వ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: