మిల్క్ బ్యూటీ తమన్నా పేరు ఒకప్పుడు మారు మోగిపొయింది..వరుస సినిమాల తో బిజిగా ఉండేది. రాను రాను అమ్మడుకు సినిమా అవకాశాలు అందని ద్రాక్షలా మారాయి..ఇప్పుడు మళ్ళీ మాత్రం సినిమాల కన్నా కూడా కాంట్రవర్సీస్‌తో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. దశాబ్ధంకి పైగా తన నటనతో పాటు అందచందాలతో మెప్పిస్తున్న తమన్నా త్వరలో ఎఫ్ 3 చిత్రంతో పలకరించనున్న విషయం తెలిసిందే..అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 తెరకెక్కింది. మే 27న ఎఫ్ 3 చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.


సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో జోరున పెంచారు.ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎఫ్ 3 ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ పాల్గొంటున్నారు. మెహ్రీన్ కూడా ఉంటోంది. కానీ తమన్నా ఉంటే ఫ్యాన్స్ కి ఆ కిక్కే వేరు. తమన్నా ఎఫ్3 ప్రమోషన్స్ లో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.మొన్నటివరకు తమన్నా కేన్స్ లో బిజీగా గడిపింది. అది ఒక కారణం కావచ్చు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగిసిన తర్వాత కూడా తమన్నా ఎఫ్3 ప్రమోషన్స్ లో జాయిన్ కాలేదు. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది . తమన్నా ఎఫ్ 3 విషయంలో హర్ట్ అయిందని.. అందుకే దూరంగా ఉంటోందని అంటున్నారు.తమన్నా అంతగా అలగడానికి కారణం సోనాల్ పాత్రకు ఇంపార్టెంట్ ఇవ్వడమే అని ఒక. వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కోడుతుంది..తమన్నా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఇలాంటి టైమ్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు వుంటే దాన్ని వాడుకోవాల్సి వుంది. అయినా కూడా పట్టించుకోలేదు.కొన్నాళ్ల క్రితమే ఎఫ్ 3 యూనిట్ కు తమన్నాకు మధ్య ఏదో జరిగిందని వెల్లడిస్తే, అబ్బే అంతా ఊ ఉత్తుత్తినే అంటూ ఖండించారు. కానీ ఇప్పుడు ఈ సీన్ అంతా చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. రిలీజ్ కి ఇక ఒక్క రోజు టైం మాత్రమే ఉంది..ఎవరెమనుకున్నా కూడా ఎఫ్3 లో తమన్నా, మెహ్రీన్ లని మరింత అందంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది..మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: