మెగాస్టార్ కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన మరొకసారి మనసున్న మనిషిగా నిరూపించుకుంది. నిన్నటివరకు వన్యప్రాణుల సంరక్షణ కోసం సహకారం అందిస్తున్న ఈమె.. నేడు వన్యప్రాణి సంరక్షణ లో గాయపడిన లేక అనారోగ్యం పాలైన ఫారెస్ట్ ఆఫీసర్ కు అపోలో హాస్పిటల్స్ లో ఉచిత వైద్య సేవలు అందిస్తామని మాట ఇచ్చి.. అందరికీ హర్షం కలుగజేసింది. ఉపాసన కామినేని మరొకసారి తమ దాతృత్వాన్ని చాటు కొని.. తన పెద్ద మనసును నిరూపించుకున్నారు. ఇకపోతే వన్యప్రాణి సంరక్షణ కోసం..జంతు , జీవరాశుల పోషణ కోసం డబ్బు తో పాటు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నట్లు సి ఎస్ ఆర్ అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసన మంచి నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణం అని చెప్పవచ్చు.
ఇకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఫారెస్ట్ గార్డులతో పాటు వన్యప్రాణి సంరక్షణ కోసం పనిచేసే ఎంతో మందికి అపోలో హాస్పిటల్స్ నెట్వర్క్ లో ఉచితంగా వైద్య సంరక్షణ తో పాటు చికిత్స కూడా అందించడానికి తమ వంతు సహాయం అందిస్తామని ఆమె మాట ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ సంస్థతో కలిసి సేవలందించడానికి ఆమె అంగీకరించారు ఇక ఉపాసన తాతయ్య అపోలో హాస్పిటల్స్ పౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక భారతదేశంలోని అడవులతో పాటు వన్యప్రాణుల సంరక్షణ రేంజర్ల కూడా ఉత్తమ శిక్షణ అందిస్తామని ఉపాసన ఇటీవల ఒప్పంద పత్రంపై సంతకం కూడా చేశారు.ఇకపోతే వన్యప్రాణుల సంరక్షణ చూస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని వేర్వేరు శాఖల ఉద్యోగుల వైద్య సేవలను కూడా ఉచితంగా చూసుకుంటామని ఆమె హామీ ఇచ్చింది. ఫారెస్ట్ సిబ్బంది ఏదైనా ఇతర అటవీ సంబంధిత రుగ్మతల వల్ల గాయపడిన వారికి కూడా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఇక ఈ ఒప్పందానికి అపోలో హాస్పిటల్స్ కష్టపడి ఉంటాయి అని అపోలో ఫౌండేషన్ తరపున ఒప్పంద పత్రంపై సంతకం చేసి అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన. ఉపాసన తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ శభాష్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: