టాలీవుడ్ మాస్ హీరోలలో ఒకరు ఆయన గోపీచంద్ , సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సిటిమర్ లాంటి పవర్ఫుల్ మాస్ మూవీ  తర్వాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన మారుతి దర్శకత్వం వహించగా, ఈ మూవీ లో రాశి కన్నా కథానాయకిగా నటించింది.

ఈ సినిమాలో రావు రమేష్, సత్యరాజ్  కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించే విధంగా ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను జూలై 1 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో పక్కా కమర్షియల్ చిత్రం బృందం లోని సభ్యులు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో,  పలు టీవీ షోల్లో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా పక్కా కమర్షియల్ సినిమా హీరో గోపీచంద్ ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా అనే షో కు గెస్ట్ గా వెళ్ళాడు. అందులో భాగంగా గోపిచంద్,  ప్రభాస్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.

గోపిచంద్,  ప్రభాస్ గురించి మాట్లాడుతూ... వర్షం మూవీ కంటే ముందే ప్రభాస్ తో నాకు మంచి స్నేహం ఉంది. అప్పట్లో  గోపీకృష్ణ మూవీస్ ఆఫీస్ కి దగ్గరికి నేను వెళుతూ ఉండేవాడిని.  ప్రభాస్ కూడా అక్కడికి బైక్ పై వచ్చేవాడు. మొదటి సారి ప్రభాస్ ని చూసినప్పుడే చాలా బావున్నాడు హీరో అవుతాడు అనుకున్నాను. ఆ తరువాత మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఎక్కువ అక్కడే కలిసేవాళ్ళం.  వర్షం మూవీ ని ప్రభాస్ నేను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాము అని తాజా ఇంటర్వ్యూలో గోపిచంద్, ప్రభాస్ గురించి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: