టాలీవుడ్ లో హీరోలు అయితే వరుసగా సినిమాలు చేస్తున్నారు కానీ, సక్సెస్ మాత్రం కంటిన్యూ గా ఉండడం లేదని చెప్పాలి. అలా చాలా మంది హీరోలు సరైన కథలను ఎంచుకోక దెబ్బతిన్న వారు ఉన్నారు. అలాగే ఈ మద్య కాలంలో సరైన హిట్ పడక ఒడిదుడుకుల మద్య కెరియర్ ని నెట్టుకొస్తున్న హీరో గోపీచంద్ కి ఇపుడు కాలం కలిసొచ్చినట్లే ఉంది. తాజాగా ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ సినిమా నిజంగానే పక్కా బ్లాక్ బస్టర్ కాకపోయినా పక్కా హిట్ అని పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది కూడా, అవును నేడు ప్రేక్షకుల ముందుకు విచ్చేసిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఫస్ట్ డే రద్దీ బాగానే కనపడుతోంది.

ఇక ఈ సినిమా ఎలా ఉంది అని ప్రేక్షకుల్ని ప్రశ్నించగా ఎక్కువ మంది ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు, ఆటో పంచ్ లు గురించి పక్కన పెడితే సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా బాగుందని స్పందిస్తున్నారు. ఇక కథ , డైరెక్షన్ విషయానికి వస్తే... మారుతి  సినిమాలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా అడ్రెస్స్ గా నిలుస్తుంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరో వైపు బలమైన కథను ముందుకు తీసుకెళుతుండటం దర్శకుడు మారుతి స్టైల్. పక్కా కమర్షియల్‌ సినిమాలో కథను ఫోకస్ చేయడం అటుంచి ఎక్కువగా కామెడీతో సాగదీశాడు అని చెప్పాలి.  టైటిల్‌కి తగ్గట్టుగా పక్కా కమర్షియల్‌ అంశాలు ఉండేలా చూసుకున్నాడు.

కానీ ప్రేక్షకులను అంతగా అలరించడం లేదు అన్నది టాక్..కానీ బోరింగ్ గా లేదు కాబట్టి ఓసారి చూసి హిట్ చేయొచ్చు అన్నది బయట టాక్. అయితే ఇదే విధంగా టాక్ ఉంటే కనుక వారం తిరగక ముందే థియేటర్ నుండి సినిమాను ఎత్తేయడం గ్యారంటీ అని మరోపక్క టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఏమి జరగనుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: