సూపర్ స్టార్ మహేష్ తో టాలీవుడ్ సూపర్ డైరెక్టర్ రాజమౌళి త్వరలో ఒక భారీ మూవీ తీయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి కాంబో మూవీ వాయిదా పడుతూ వచ్చి ప్రస్తుతం సెట్ అయింది. అయితే లేటెస్ట్ గా త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్న మహేష్, అది పూర్తికాగానే రాజమౌళి మూవీని ప్రారంభించనున్నారు. అందులో ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్టోరీస్ పై కసరత్తు చేస్తున్నట్లు టాక్.

మరోవైపు రాజమౌళి అండ్ టీమ్ కూడా మహేష్ పాత్ర కోసం కొన్ని డిజైన్స్ సిద్ధం చేస్తున్నారట. ముఖ్యంగా అడ్వెంచరస్ డ్రామా మూవీగా హాలీవుడ్ రేంజ్ లో ఎక్కడా కూడా ఖర్చుకి వెనకాడకుండా అత్యంత భారీ వ్యయంతో ఈ మూవీ రూపొందనున్నట్లు టాక్. కేఎల్ నారాయణతో పాటు బాహుబలి సినిమాల నిర్మాత శోభు యార్లగడ్డ కూడా దీనికి నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించనున్నారట అయితే ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అనే రీతిలో డిజైన్ చేస్తున్న రాజమౌళి, హీరోయిన్, ఇతర క్యాస్టింగ్ వంటివి కూడా గట్టిగా ఆలోచన చేస్తున్నారట.

అయితే మహేష్ బాబు ఈ మూవీ కోసం భారీగా బాడీ పెంచనుండడంతో పాటు తన మేకోవర్ లో తన కెరీర్ లో ఇప్పటివరకు లేనంత పూర్తిగా మార్పులు చేయనున్నట్లు టాక్. త్వరలో అందుకోసం మహేష్ ఒక స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ కూడా తీసుకోనున్నారట. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రాజమౌళి, మహేష్ ల మూవీ ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటినుండే ఈ మూవీ అందరిలో ఈ రేంజ్ హైప్ ఏర్పరిస్తే, ఇక త్వరలో పట్టాలెక్కి, అనంతరం పూర్తిగా షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: