ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ  తో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మరి కొన్ని రోజుల్లో పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప ది రైస్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ తర్వాత ఏ సినిమాలో నటిస్తాడు అనే ఆసక్తి చాలామంది ప్రేక్షకుల్లో నెలకొంది. అందులో భాగంగా అల్లు అర్జున్ తదుపరి సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తాజా ఇంటర్వ్యూలో బన్నివాసు తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూలో బన్నీవాసు మాట్లాడుతూ... అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్' మూవీ తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించే చాన్స్ ఉంది. అలాగే అల్లు అర్జున్ సినిమా గురించి త్రివిక్రమ్ తో నేను మాట్లాడడం కూడా జరిగింది అని బన్నీవాసు చెప్పుకొచ్చాడు. దీని ప్రకారం చూసుకుంటే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతునట్లు తెలుస్తుంది. ఇది వరకే అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి , అలా వైకుంఠపురంలో సినిమాలు  తెరకెక్కి మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: