మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు  . అలాగే ప్రస్తుతం కూడా రామ్ చరణ్ అదిరి పోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ,  తన తదుపరి మూవీ లను కూడా అదే రేంజ్ లో సెట్ చేసి పెట్టు కున్నాడు .

ఇలా పాన్ ఇండియా రేంజ్ లో  తన కంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న రామ్ చరణ్ గురించి ఇప్పటికి ఎంతో మంది సెలబ్రెటీలు ఎన్నో సందర్భాలలో మాట్లాడిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో 'నా పేరు సీసా' అనే ఒక స్పెషల్ సాంగ్ లో తన అందాలతో కుర్రకారు మనసు దోచుకున్న అన్వేషి జైన్ కూడా రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అన్వేషి జైన్ ... రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ... రామ్ చరణ్‌ ను సూపర్ హ్యాండ్‌ సమ్‌ గా గుర్తించానని , అలాగే రామ్ చరణ్ తో డేట్‌ కి వెళ్లాలనుకుంటున్నానని ఈ ముద్దు గుమ్మ తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ స్పెషల్ సాంగ్ లో నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఈ నెల 29 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ తో అన్వేషి జైన్ ఏ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: