యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కించతున్నారు.  

రామ్ పోతినేని మరియు బోయపాటి శ్రీను ఇద్దరికి  ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుండగా ,  రామ్ పోతినేని ఈ సినిమా కథ విషయంలో బోయపాటి శ్రీను కి  కొన్ని మార్పులు ... చేర్పులు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే ఒకే అయిన కథకు మార్పులు ... చేర్పులు ఎందుకు అని అనుకుంటున్నారా ...  తాజాగా రామ్ పోతినేని , లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్  మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల అయిన ది వారియర్ మూవీ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది.

మరీ ముఖ్యంగా ఈ సినిమా కథ రొటీన్ గా ఉండడం , అలాగే ఈ మూవీ స్క్రీన్ ప్లే కూడా అంత బలంగా లేకపోవడం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.  అలా ది వారియర్ మూవీ కథాకథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ది వారియర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ కలెక్షన్ లను రాబట్టలేకపోయింది. అలా ది వారియర్ మూవీ ఎఫెక్ట్ వల్ల రామ్ పోతినేని ,  బోయపాటి శ్రీను ఇప్పటికే తయారు చేసిన కథలో కొన్ని మార్పులు ... చేర్పులను చూపించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: