మజిలి , వెంకీ మామ , లవ్ స్టోరీ , బంగార్రాజు ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య కొంత కాలం క్రితమే థాంక్యూ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి టాలెంటెడ్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు . ఈ మూవీ లో రాశి ఖన్నా , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా అద్భుతం గా ఉండడంతో ఈ మూవీ పై అక్కినేని అభిమానులతో  పాటు మాములు  సినీ ప్రముఖులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు .

మంచి అంచనాల నడుమ జులై 22 వ తేదీన విడుదల అయిన థాంక్యూ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. దానితో థాంక్యూ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయింది .   ఇలా ప్రేక్షకులను థియేటర్ లలో నిరుత్సాహపరిచిన థాంక్యూ మూవీ ఈ రోజు నుండి 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . థాంక్యూ మూవీ ఈ రోజు నుండి అనగా ఆగస్ట్ 11 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ని థియేటర్ లలో ఎవరైనా చూద్దాము అని మిస్సయిన వారు ఉంటే ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: