అలనాటి కాలంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన టబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . టబు తెలుగు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగిన వెంకటేష్ , నాగార్జున ,  బాలకృష్ణ , చిరంజీవి  సరసన హీరోయిన్ గా నటించింది . అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టబు నటించిన అనేక సినిమాలు మంచి విజయాలు సాధించడం తో ఈ ముద్దు గుమ్మ ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన అలా వైకుంఠపురంలో మూవీ లో టబు ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.  అలా వైకుంఠపురంలో మూవీ లో అల్లు అర్జున్ హీరోగా నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం టబు ఎక్కువగా బాలీవుడ్ మూవీ లలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా టబు షూటింగ్ లో తీవ్రంగా గాయాలపాలు అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినా అజయ్ దేవగన్ ప్రస్తుతం బోలా అనే మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ మూవీ లో టబు కూడా నటిస్తోంది. టబు ఈ మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ చిత్రీకరణలో భాగంగా గ్లాస్ పగిలి టబు కన్ను మరియు నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. దానితో టబు కి తీవ్ర రక్తస్రావం కూడా జరిగిందట. దానితో వెంటనే టబు ని ఆస్పత్రికి తరలించి చికిత్స ను అందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: