డైరెక్టర్ హానురాగవపూడి దర్శకత్వంలో హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్గా మృణాల ఠాగూర్, ముఖ్యమైన పాత్రలో రష్మిక కలిసి నటించిన చిత్రం సీతారామం. ఈ మధ్యకాలంలో వచ్చిన క్లాసికల్ సినిమాగా ఈ చిత్రం పేరు పొందింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టిమ్ నాగార్జునను చీఫ్ గెస్ట్ గా పిలిచి ఒక సక్సెస్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ వేదికపై నాగార్జున మాట్లాడుతూ దత్తు గారు కంటే నేను ఎక్కువగా ప్రేమించే వారు ఇద్దరు ఉన్నారు.. అందులో ముఖ్యంగా స్వప్న, ప్రియాంక చిన్నప్పటి నుంచి వాళ్లు నాకు తెలుసు వారిద్దరు అశ్వని దత్ గారికి ఎంతో అండగా ఉంటారని తెలిపారు.

మహానటి, జాతి రత్నాలు, తర్వాత సీతారామంతో ఇప్పుడు మరొక విజయాన్ని అందుకున్నారు అని తెలిపారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ ఎప్పటినుంచి ఉన్నది ఈ బ్యానర్ గౌరవాన్ని కాపాడుకుంటూ అలానే వస్తున్నారని తెలిపారు ఆ బ్యానర్ లో నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు నేను ఐదు సినిమాలు వరకు చేశాను అలాగే చిరంజీవి కూడా నటించారని తెలిపారు. ఈ బ్యానర్ పై ఎంతోమంది స్టార్ హీరోలు సినిమాలు చేస్తూ వస్తున్నారని అలాంటి బ్యానర్ పేరును వారు నిలబెడుతున్నందుకు చాలా గర్వంగా ఆనందంగా ఉందని తెలిపారు.


సీతారామం సినిమా చూసి చాలా జలసిగా ఫీల్ అయ్యాను.. ఎందుకంటే నాకు రావలసిన రోల్స్ దుల్కర్ కి వెళ్ళిపోయింది ఈ సినిమా చూస్తుంటే గతంలో నేను గీతాంజలి, మన్మధుడు సంతోషం వంటి రొమాంటిక్ సినిమాలు గుర్తుకు వచ్చాయని తెలిపారు. ఇక ఈ సినిమాతో రొమాన్స్ ఇస్ బ్యాక్ అనిపించేలా దుల్కర్ సల్మాన్ నటించారని నాగార్జున తెలిపారు. ఇక ప్రేమ కథ సినిమాలు ఆడియన్స్ కు నచ్చితే దానిని ఎక్కడికైనా తీసుకువెళ్తారు అని తెలిపారు. ఈ సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ చీరలు చాలా బాగా ఉన్నాయి నేను స్వప్న కి కాల్ చేసి ఈ విషయాన్ని తెలిపానని నాగార్జున చెప్పారు. ఇలాంటి సినిమా ఇప్పటి చేయడానికి చాలా ధైర్యం ఉండాలి ఈ మధ్యకాలంలో ఇంత బ్యూటిఫుల్ సినిమా నేను ఎప్పుడూ చూడలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: