మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రామ్ చరణ్ ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం రామ్ చరణ్ , దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా పాపులారిటీని పెంచుకున్నాడు. ఈ మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ లో 15 వ మూవీ గా తేరకేక్కుతుండడంతో ఈ మూవీ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణను జరుపుకుంటుంది.  ఈ మూవీ షూటింగ్ కొన్ని షెడ్యూల్ లను కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తుంది.

మూవీ కి భారీ నాన్ థియేట్రికల్ రైట్స్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి ఒక ప్రముఖ సంస్థ నుండి 200 కోట్ల కు నాన్ థియేట్రికల్ రైట్స్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇది సెన్సేషనల్ అనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీ కి థియేట్రికల్ రైట్స్ ఏ రేంజ్ లో దక్కుతాయో చూడాలి. ఈ మూవీ లో కియారా అద్వానీ , రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ లో సునీల్ , అంజలి ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: