చాలా కాలం తర్వాత కార్తికేయ2 తో సాలిడ్ హిట్‌ అందు కున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ. చందు మొండేటి దర్శకత్వం లో కార్తికేయ కు సీక్వెల్‌ గా ఈ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల తో పాటు నార్త్‌ అడి యెన్స్‌ కు పిచ్చి పిచ్చి గా నచ్చేసింది.
బాక్సా ఫీస్‌ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించడం తో హీరో, హీరోయిన్ల తో పాటు చిత్ర బృందమం తా తెగ సంబర పడిపోతోంది. కాగా రెండు లు సూపర్‌ హిట్‌ కావడం తో కార్తికేయ3 కూడా వస్తుందా? లేదా? అన్న ప్రశ్న సినీ ప్రియు ల్లో నెలకొంది. ఈ విషయం పై మాట్లా డిన హీరో నిఖిల్‌ కార్తికేయ3 క్లారిటీ ఇచ్చాడు.. ‘కార్తికేయ రెండు భాగాలూ ఆడియెన్స్‌ ను బాగా ఆకట్టు కున్నాయి. అందరి దీవెన లు, ఆశీర్వాదాల తో కార్తికేయ3 కూడా తీయనున్నాం. ఈ ఎప్పుడు ప్రారంభిస్తామా? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామా?అని చాలా ఆత్రుత గా ఉంది. ఎందుకంటే మూడో పార్ట్‌ను 3Dలో రూపొందించనున్నారు’ అని చెప్పకొచ్చాడు నిఖిల్‌.

కాగా శ్రీకృష్ణుని జన్మస్థానమైన ద్వారక లో దాగున్న రహస్యాల నేపథ్యం లో కార్తికేయ2 ను ఆసక్తి గా తీర్చిదిద్దారు చందు మొండేటి. నిఖిల్‌ సరసన అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌ గా నటించింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాసరెడ్డి, సత్య, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్‌ తో ఎలాంటి అంచ నాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రూ.100 కోట్లకు పైగానే కలెక్ట్‌ చేసినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా నిఖిల్ ప్రస్తుతం కేరళ లో కార్తికేయ 2 మలయాళ వెర్షన్ ప్రమోషన్‌ లో బిజీగా ఉన్నాడు. అక్కడ సెప్టెంబర్ 23న ఈ విడుదల కానుంది

మరింత సమాచారం తెలుసుకోండి: