జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన అనసూయ మరియు సుడిగాలి సుధీర్ స్టార్ మా లో రచ్చ రచ్చ చేస్తారని అంతా ఆశించారు. అక్కడ కామెడీ స్టార్ట్స్ కార్యక్రమంలో వీళ్ళ డామినేషన్ క్లియర్ గా ఉంటుందని కచ్చితంగా జబర్దస్త్ రేంజ్ లో అక్కడ కార్యక్రమం ఉంటుందని అంతా భావించారు.
కానీ సుధీర్ మరియు అనసూయ వెళ్ళిన కొన్ని వారాల పాటు ఆ కార్యక్రమం కొనసాగింది.. అంతా బాగానే ఉంది. కానీ అనుహ్యంగా ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ఎత్తి వేశారు. అసలు ఆ కార్యక్రమం లేకుండా చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ స్టార్ మా పరివార్ అంటూ శ్రీముఖి యాంకర్ గా ఆ స్లాట్ లో వేరే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాంతో అనసూయ మరియు సుధీర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ మా న్ని నమ్ముకుని వస్తే ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్ శ్రీదేవి, డ్రామా కంపెనీ లతో సుధీర్ ఒక స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు.. ఆ సమయంలో స్టార్ మా వాళ్ళు తీసుకు వచ్చి భారీ పారితోషకం ఆశలు కల్పించి ఉసురు మనిపించారంటూ సుధీర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జబర్దస్త్ లో చేసిన సమయంలో అనసూయకు హీరోయిన్ రేంజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆమెకు అత్యంత దారుణమైన పరిస్థితి అన్నట్లుగా తయారైంది. వరుసగా సినిమాలు చేయలేదు, అలాగే మళ్లీ ఈటీవీలో కనిపించను లేదు. స్టార్ మా వాళ్ళు అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వెళ్లి యాంకరింగ్ చేయాల్సిందే తప్పితే అనసూయ ఖాళీగా ఉండాల్సిందే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
చక్కని అవకాశాన్ని అత్యాశకు పోయి వదిలేసిన వీరిద్దరిని కొందరు విమర్శిస్తూ ఉంటే కొందరు జాలి పడుతున్నారు. ఇదే సమయంలో స్టార్ మా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మరికొన్ని రోజుల తర్వాత అయినా మళ్ళీ స్టార్ మా వారు కామెడీ స్టార్స్ కార్యక్రమాన్ని మొదలు పెట్టి వీరిద్దరికీ అవకాశం ఇవ్వాలంటూ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా నష్టపోయిన వీళ్ళు ముందు ముందు అయినా అవకాశం దక్కితే అప్పుడు తమను తాము నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అలా కాదని స్టార్ మా వాళ్ళు వీరిని పూర్తిగా విస్మరిస్తే అడపాదడప సినిమాల్లో కనిపిస్తూ కెరియర్ కోల్పోవాల్సి వస్తుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ మరియు అనసూయ లు జబర్దస్త్ ను వీడి వెళ్లడంపై మీ అభిప్రాయం ఏంటి?

మరింత సమాచారం తెలుసుకోండి: