రష్మిక మందాన్న.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న నెంబర్ వన్ హీరోయిన్. తెలుగులో తాను నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..
ఇప్పటికే కన్నడ, తెలుగు ఇండస్ట్రీలలో బిజీగా ఉన్న రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్ లోను ఛాన్సులు కొట్టేస్తోంది. పుష్ప సినిమా హిట్‌ తో రష్మిక నేషనల్ క్రష్‌ గా మారింది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె హడావుడియే కనిపిస్తుంది. పుష్ప, సీతారామం సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక క్రేజ్ ఫుల్ గా పెరిగిపోయింది. ఇటు తెలుగు.. అటు తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా మారింది. ఎక్కడ చూసినా రష్మికనే కనిపిస్తుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూనే ఉంటుంది.

స్టార్ హీరోయిన్‌ గా

వరుసగా నాలుగైదు హిట్ సినిమాలతో సౌత్‌ లో స్టార్ హీరోయిన్‌ గా మారిన రష్మిక.. భారత్ లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా నిలిచింది. సౌత్ లో తానేంటో నిరూపించిన ఈ బ్యూటీ... అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వికాస్ దర్శకత్వంలో వస్తున్న అమితాబ్ బచ్చన్ సినిమా గుడ్ బాయ్ లో, సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్నుతో పాటు మరో హిందీ మూవీలో నటిస్తోంది.

ప్రతీపాత్ర దేనికదే ప్రత్యేకం

ఇక ఇటీవల ఇంత బిజీగా ఉన్న సౌత్ బ్యూటీ ఇంకెవరూ లేరు. రష్మిక ఎంపిక చేసిన, చేసుకుంటున్న ప్రతీపాత్ర దేనికదే ప్రత్యేకం. గుడ్ బాయ్ లో అమితాబ్ కి కూతురుగా నటిస్తున్న రష్మిక.. మిషన్ మజ్నులో స్పై ఆపరేషన్ లో పాల్గొనే యాక్షన్ క్వీన్ గా కనిపించనుంది. ఇక పుష్ప-2లో రొమాంటిక్ మాస్ గాళ్ గా కనిపించబోతోంది. వీటన్నిటికీ భిన్నంగా పూర్తి ప్రేమకథా చిత్రంలోను ఒక ప్రముఖ యువహీరోతో రొమాన్స్ కి రెడీ అవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఆషిఖి3 లో రష్మిక

రష్మిక మందాన్న ముంబైకి చెందిన పాపులర్ ప్రాంచైజీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆషిఖి, ఆషిఖి2 చిత్రాలకు సీక్వెల్ గా వస్తున్న ఆషిఖి3 లో రష్మిక నటించబోతోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తున్నట్లు వినికిడి. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకుడు. దీంతో పాటు తెలుగులోను జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రంలోను రష్మిక హీరోయిన్ గా నటించబోతోంది.

రష్మిక డిమాండ్ ఏ మాత్రం తగ్గట్లేదు

ఇక తనకున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్ లో రెండు నుంచి మూడు కోట్లు రేంజ్ లో పారితోషకం అందుకుంటున్న రష్మిక మందన్న.. బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు నాలుగు కోట్లపైనే తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇక భారీ హిట్ కొట్టిన పుష్ప సీక్వెన్స్.. పుష్ప2 కోసం కూడా భారీగా రెమ్యునరేషన్ అడుగుతున్నన్నట్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నా... కోవిడ్ వల్ల చాలా సినిమాలు ఆగిపోయినా... రష్మికకు మాత్రం డిమాండ్ ఏ మాత్రం తగ్గట్లేదు. వరుసగా సినిమాలు చేస్తూ.. హిట్ లతో దూసుకెళ్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: