టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వివి వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా పూరి జగన్నాథ్ గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇటీవల పూరి జగన్నాథ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వినిపించడంతో ఈ వార్తలపై వినాయక్ స్పందించారు.అయితే కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసమే ఇలాంటి వార్తలు రాస్తుంటారు అయితే ఈ సినిమా కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టారు ఎంత వచ్చింది 

అనేది పూరికి మాత్రమే తెలుసని ఈయన పేర్కొన్నారు.పూరి జగన్నాథ్ గతంలో కూడా ఇలాంటి ఫ్లాప్ సినిమాలు ఎదురైనప్పుడు ఆయన పని అయిపోయింది అనుకున్నారు. ఇక్కడ కట్ చేస్తే పోకిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఇలాంటి ఎత్తు పల్లాలు సర్వసాధారణమేనని వినాయక్ పేర్కొన్నారు. పోయిన దాన్ని తిరిగి పొందలేనంత అసమర్థుడు పూరి జగన్నాథ్ కాదని ఆయనకి ఆ సామర్థ్యం ఉందని ఈ సందర్భంగా ఈయన పూరి గురించి ఎంతో గొప్పగా వర్ణించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో చేశారు.అయితే  ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం ఉంటుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై తాజాగా డైరెక్టర్ స్పందించారు. ఇక ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ అదుర్స్ సీక్వెల్ లేనట్టే అని సమాధానం చెప్పారు.ఇకపోతే ఈ సీక్వెల్ కోసం రెండు మూడు కథలను చూసిన సెట్ కాకపోవడంతో ఈ సినిమా సీక్వెల్ వద్దని భావించాము. ఇక ఈ సినిమా తారక్ కెరియర్ తోపాటు తనకి కూడా ఎంతో మంచి పేరు తెచ్చిందని ఇలాంటి సినిమాని టచ్ చేయకపోవడమే మంచిదని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: