చియాన్ విక్రమ్ ,  కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ,  శోభితా ధూళిపాల ,  ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మూవీ ఈ నెల అనగా సెప్టెంబర్ 30 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించగా , ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో మొదటి భాగం ఈ నెల 30 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో ఒకే రోజు భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ దేశ వ్యాప్తంగా ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా పొన్నియన్ సెల్వన్ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

పొన్నియన్ సెల్వన్ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్  టైమ్ ని కూడా లాక్ చేసినట్లు సమాచారం. పొన్నియన్ సెల్వన్ మూవీ 2 గంటల 47 నిమిషాల 6 సెకండ్ ల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: