పవన్ తో సినిమా చేయడం అంటే అదృష్టంగా భావించే వారు ఒకప్పుడు దర్శకులు. కానీ ఇప్పుడు ఇబ్బంది గా ఫీల్ అవుతున్నారు. దానికి కారణం పవన్ సినిమా అనౌన్స్ చేయడం ఆ తర్వాత అది ఎప్పుడు చేస్తాడో అన్న క్లారిటీ రాకపోవడం జరుగుతుంది. దాంతో ఆయనతో సినిమా అంటేనే భయపడిపోతున్నారు మన దర్శకులు. హరి హర వీరమల్లు చిత్రానికి అడుగడునా అడ్డంకులే ఎదురయ్యాయి మొదటినుంచి. అలా అనేకంటే పవన్ కావాలనే దీన్ని పక్కన పెట్టాడని కొంతమంది చెబుతుంటారు. ఇప్పుడు ఈ సినిమా చేయడానికి కారణం నిర్మాత అనే చెప్పాలి. అయన కోసమే ఈ సినిమా చేస్తున్నాడట పవన్.

లేదంటే దీన్ని పక్కన పెట్టేసి వేరే సినిమాలు చేసేవాడే. అలా లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ కొన్నాళ్ళు వాయిదా పడింది. పరిస్థితులు సద్దుమణిగాక చకచకా పూర్తి చేద్దాం అనుకుంటే పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. అలా చాలాసార్లు ఈ సినిమా పోస్ట్ ఫోన్ అయ్యింది. తాజాగా ఈ సినిమా ఉందని ఆ సినిమా కి సంబంధించి ఓ టీజర్ ద్వారా వెల్లడి అయ్యింది. తాజాగా ఈ సినిమా ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ నిర్వహించి సినిమా షూటింగ్ పై అప్డేట్ ఇచ్చారు. మొదట్లో  హరి హర వీరమల్లు రషెస్ చూసిన పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారని, స్క్రిప్ట్ లో మార్పులు సూచించారని ప్రచారం జరిగింది.

అది ఇప్పటికి పూర్తి కాగా ఆ సినిమా ను మొదలుపెట్టబోతున్నాడు పవన్.  హరి హర వీరమల్లు చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నగా ఈ సినిమా తో పాటే పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం ఎప్పుడు మొదలవుతుందా అనిఅంటున్నారు. దానిపై పవన్ క్లారిటీ ఇవ్వాల్సింది అంటున్నారు. ఇంకోవైపు హరీష్ శంకర్ తన తదుపరి సినిమా ను విజయ్ దేవరకొండ తో చేయడానికి చూస్తున్నాడు. చూస్తుంటే పవన్ హరీష్ ల సినిమా అటకెక్కేసినట్లే అని అనిపిస్తుంది. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో మరీ. పవన్ ఇప్పటికైతే హరిహర వీరమల్లు సినిమా పై నే పూర్తి దృష్టి పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: