ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్నాడు ప్రభుదేవా. ఈయన తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని స్టార్ కొరియోగ్రాఫర్ గా అగ్రస్థానంలో ఉన్న విషయం మనకు తెలిసిందే.


ఈయన క్రేజ్ ఎలా ఉంటుందంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి వారే పిలిచి మరీ చాన్స్ ఇచ్చేంత. కేవలం కొరియోగ్రాఫర్ గానే కాకుండా బాలీవుడ్ లో డైరెక్టర్ గా అలాగే తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు.ఇక బాలీవుడ్ స్టార్ హీరోలైన అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లకు ప్రభుదేవా చాలా స్పెషల్. ఈయన తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయిన పోకిరి వంటి సినిమాని హిందీ లో తీసి మంచి హిట్టు కొట్టారు.


సౌత్ ఇండస్ట్రీ లో తమిళ, తెలుగు, హిందీ లో ఓ వైపు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరో వైపు డైరెక్టర్ గా కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు. ఇంత బిజీ లైఫ్ ఉన్నా కూడా వెండి తెర మీద కనిపించే ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోరు. ఇక ఇంతటి క్రేజ్ ఉన్న ప్రభుదేవా జీవితంలో అనుకోని కొన్ని సంఘటనలు జరిగి ఆయన అప్పట్లో తరచూ వివాదంలో ఇరుక్కున్నారు. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ అయిన నయనతారతో లవ్ ఎఫైర్ నడిపి చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. నయనతార అప్పటికే శింబుతో ప్రేమలో పడి బ్రేకప్ చెప్పింది.ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది.


అయితే ప్రభుదేవా నయనతార పెళ్లి కూడా చేసుకుంటారంటూ అప్పట్లో ఎన్నో వార్తలు అయితే వచ్చాయి. అంతేకాదు ప్రభుదేవా నయనతార కోసం తన మొదటి భార్య కు కూడా విడాకులు ఇచ్చారని తెలిసింది. కానీ వీరిద్దరికీ ఎక్కడ గొడవ వచ్చిందో తెలియదు కానీ వీరి మధ్య రిలేషన్ అయితే కట్ అయింది. అయితే నయనతారను ప్రభుదేవా లోలోపల చాలా మోసం చేశారని అప్పట్లో ఓ టాక్ వినిపించింది. నయనతార నుంచి దాదాపు 20 కోట్ల వరకు ప్రభుదేవా తీసుకున్నారట. ఇక ఏది ఏమైనప్పటికీ ప్రభుదేవా తన అవసరాల కోసం నయనతార ను పూర్తిగా వాడుకొని మోసం చేశాడని నయనతార అభిమానులు ఇప్పటికీ కూడా అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: