అల్లు అర్జున్ మేనమామ కొడుకు వీరాన్ ముత్తుంశెట్టిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పలు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల కాకముందే బావమరిదీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడానికి అందుకు తగ్గ బాధ్యతలు అల్లు అర్జున్ తీసుకున్నట్లుగా సమాచారం. అల్లు హోమ్ బ్యానర్ పై గీత ఆర్ట్స్ లో తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు విరాన్. ఇక ఇదే క్రమంలో బతుకు బస్టాండ్ అనే చిత్రంతో విరాన్ హీరోగా పరిచయం కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సినిమా గత ఏడాది సమ్మర్ లోని విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నది.


ఫస్ట్ లుక్ , గ్లింప్స్ ,టీజర్, సాంగ్స్ ఇలా అన్నిటిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ తెలియజేస్తూ ఉండేవారు.కానీ ఏమైందో తెలియదు కానీ ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈమధ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటి లో విడుదల చేస్తారని వార్తలు కూడా వినిపించాయి. అయితే అవన్నీ నిజం కాలేదు అల్లు కాంపౌండ్ నుంచి హీరో విరాన్ సినిమా అని అందరూ మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అతడు అల్లు అర్జున్ తో కలిసి కమర్షియల్ యాడ్ షూటింగ్లో పాల్గొని మళ్ళీ వార్తల్లో నిలిచారు. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జొమోటో ప్రకటనలు అల్లు అర్జున్తో కలిసి విరాన్ కనిపించారు.


ఈ నేపథ్యంలో విరాన్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా అల్లు అర్జున్ కి కృతజ్ఞతలు తెలుపుతూ థాంక్యూ అనేది చాలా చిన్న పదం అవుతుంది లవ్ యు అల్లు అర్జున్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు అంటూ పలు రకాలుగా కామెంట్ చేశారు. నా సోదరుడు శరత్ చంద్ర నాయుడుకి ఇది చాలా స్పెషల్ థాంక్స్ ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన తీరు కూడా ఎంతో అద్భుతంగా ఉందని తెలియజేశారు. ఇక దీంతో అల్లు అరవింద్ తన మేనమామ కొడుకుకు బాగా మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: