తెలుగు సీనియర్  స్టార్  హీరో అక్కినేని నాగార్జున ఇప్పుడు 'ది ఘోస్ట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'గరుడవేగ'తో తనపై అంచనాలు పెంచిన యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా బుధవారమే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం నాగ్ కోరుకున్న విజయం అందించేలా ఉందో లేదో చూద్దాం.ఇక ఈ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో అక్కినేని నాగార్జున నటించి ఓకే అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన గ్రేస్ చూడొచ్చు. అదే సమయంలో మెర్సీలెస్ కాప్ పాత్రలో నాగ్ అనుకున్నంత ఫెరోషియస్ గా కనిపించలేదనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో.. హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాల్లో నాగ్ మరింత ఎనర్జీ చూపించాల్సింది. ఐతే ఈ వయసులో కాప్ పాత్రకు యాప్ట్ అనిపించే ఫిజిక్.. స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చినందుకు మాత్రం నాగార్జునను అభినందించాల్సిందే. హీరోయిన్ సోనాల్ చౌహాన్ రోల్ కు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆమెకు పెద్దగా పెర్ఫామ్ చేసే స్కోప్ దక్కలేదు.


గుల్ పనాగ్ కీలక పాత్రలో బాగానే చేసింది. అనైక సురేంద్రన్ చలాకీ నటనతో ఆకట్టుకుంది. విలన్ పాత్రధారులంతా కొత్తవాళ్లే. అందరూ ఓకే అనిపించారు.'గరుడవేగ'లో మాదిరి ఒక థ్రిల్లర్ కథకు ఫ్యామిలీ ఎమోషన్లు కూడా జోడించాలని డైరెక్టర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టేసింది. 'ది ఘోస్ట్' అనే టైటిల్.. ట్రైలర్ చూసి ఏదో ఊహించుకుని థియేటర్లలోకి అడుగుపెట్టిన ప్రేక్షకులకు అక్కడ కనిపించేది వేరు.అంతా కూడా చాలా బోరింగ్ గా సాగుతుంది. ప్రథమార్ధం ముగిసేసరికే ప్రేక్షకులు ఈ కథతో ఏమాత్రం కనెక్ట్ కాని సినిమా నడుస్తుంది.ఆఖర్లో వచ్చే యాక్షన్ ఘట్టాలు.. హీరో ఎలివేషన్ బాగానే అనిపించినా.. ఆ పాత్రతో.. కథతో అప్పటికే డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల పెద్దగా కిక్కేమీ రాదు. చివరికి వచ్చేసరికి దర్శకుడు ఈ కథ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడన్నది అర్థం కాదు. ప్రవీణ్ సత్తారు నుంచి ప్రేక్షకులు ఆశించిన ఏ అంశాలూ ఇందులో లేవు. యాక్షన్ సన్నివేశాల్లో మినహాయిస్తే కథాకథనాల్లో అతడి ముద్ర కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: