మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయిన మృణల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన సీతా రామం మూవీ లో దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా , వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

ఇది ఇలా ఉంటే మృణాల్ ఠాకూర్ నటించిన మొట్ట మొదటి తెలుగు మూవీ తోనే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని ,  అంతకు మించిన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించు కుంది . ఇలా సీతా రామం మూవీ తో మృణాల్ ఠాకూర్ ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిం ది.

మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లా డుతూ ...  లవ్ సోనియా కోసం రెండు వారాల పాటు కోల్కతా లోని వేశ్య గృహంలో ఉన్నాను అని చెప్పు కొచ్చింది . అక్కడ వారి కథలు విని చలించి పోయాను అని ,  చాలా రోజులు అవే వెంటాడాయని మృణాల్ ఠాకూర్ పేర్కొంది . అలాగే డిప్రెషన్ లోకి కూడా వెళ్లాను అని , డైరెక్టర్ కౌన్సిలింగ్ ఇవ్వడంతో సాధారణ స్థితికి వచ్చాను అని ఓ ఇంటర్వ్యూ లో మృణాల్ ఠాకూర్ చెప్పు కొచ్చింది. ఇలా తాజా ఇంటర్వ్యూలో భాగంగా మృణాల్ ఠాకూర్ ఈ విషయాలను వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: