మలయాళ ఇండస్ట్రీ  లో నటులు గా ఎంతో మంచి పేరు ప్రఖ్యా తలు సంపాదించు కున్నారు మోహన్ లాల్, మమ్ముట్టి. వీరిద్దరూ మలయాళ చిత్ర పరిశ్రమ లో అగ్ర హీరో లుగా కొనసాగడమే కాకుండా మంచి మిత్రులు గా కూడా అందరికీ తెలిసిందే.
ఇకపోతే తాజాగా మమ్ముట్టి మోహన్ లాల్ దర్శకత్వం వహించిన సినిమా పూజా కార్యక్రమా లలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమా లలో ముమ్మట్టి స్పెషల్ అట్రాక్షన్ గా నిలచారు.
పూజా కార్యక్రమా లలో భాగంగా 34 సంవత్సరాల క్రితం మోహన్ లాల్ పెళ్లిలో ఉపయోగించినటు వంటి సన్ గ్లాసెస్ పెట్టు కొని తిరిగి తన సినిమా పూజ కార్యక్ర మాలకు వెళ్లడం అందరిని ఆకట్టుకుంది. సాధారణంగా నటుడు ముమ్మటికి ఏదైనా పాత వస్తువులను పడేయటానికి ఏమాత్రం ఇష్టపడరట వాటిని ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టే అలవాటు ఉందని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు ఈ క్రమంలోనే 1988లో మోహన్ లాల్ పెళ్లి కోసం కొన్నటువంటి గాగుల్స్ ను మమ్ముట్టి ఎంతో భద్రంగా దాచిపెట్టారు. అయితే తిరిగి ఆయన సినిమా వేడుక కోసం అదే గాగుల్స్ పెట్టుకొని వెళ్లడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇలా పాత వస్తువులను భద్రంగా దాచిపెట్టి తిరిగి వాటిని ధరించడం మమ్ముట్టికి అలవాటుగా ఉందనీ తెలిపారు. మోహన్ లాల్ పెళ్లి సమయంలో ముమ్ముట్టి ధరించినటువంటి తెల్లటి చొక్కా కళ్ళజోడుతో తన పెళ్లిలో సందడి చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది. ఆయన 'సంఘం' లొకేషన్‌ నుంచి నేరుగా పెళ్లికి హాజరయ్యారనీ మోహన్ లాల్ తెలియజేశారు.ఇక వీరిద్దరూ మలయాళ హీరోలు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే ఒకరు జనతా గ్యారేజ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేయగా మరొకరు ఏపీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: