దేశం మెచ్చిన హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ ఈరోజు తన 80వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆయన ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్‌ను తెలుపుతున్నారు. ఇక అది అలా ఉంటే అమితాబ్ తెలుగులో ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ప్రాజెక్ట్ కేలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక ఆ పోస్టర్‌లో లెజెండ్స్‌కు చావుండదు అనే అర్థం వచ్చేలా లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్టల్స్ అంటూ రాసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమా ప్రాజెక్ట్ కే.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరోకీలక పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 55 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. ఇక తాజాగా మరో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్'లో చిత్రబృందం భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అంతేకాదు ఈ యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయడానికి చిత్రబృందం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం తెలుస్తోంది..

సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తున్నట్లు సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్‌ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్‌ను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్.. అందులో భాగంగానే హాలీవుడ్ నుంచి ఓ నలుగురు యాక్షన్‌ డైరెక్టర్లను కూడా సినిమా కోసం తీసుకొస్తున్నారట.ఇక ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్న హిందీ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. 'ప్రాజెక్ట్ కే' సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అశ్వినిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రం 2024లో విడుదలకానుంది. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: