ఈ ఏడాది 400 కోట్లు వసూళ్లు అందుకున్న సినిమాలు మొత్తంగా ఐదు ఉన్నాయి. అయితే అందులో కేవలం ఒకే ఒక బాలీవుడ్ సినిమా ఉండడం విశేషం. మిగతా నాలుగు సినిమాలు కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందినవే.ఇక మొదట అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో కేజిఎఫ్ సెకండ్ పార్ట్ నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1250 కోట్ల గ్రామస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక దీని తర్వాత rrr సినిమా అత్యధికంగా 1175 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది 1000 కోట్లు దాటిన సినిమాలలో ఈ రెండు మాత్రమే నిలిచాయి. ఇక విక్రమ్ సినిమా అయితే 450 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో తమిళ చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.ఇక కమలహాసన్ కూడా ఇదే సినిమాతో మళ్ళీ తెలుగులో తన సత్తా చాటారు. రీసెంట్ గా వచ్చిన మరొక తమిళ సినిమా పొన్నియిన్ సెల్వబ్ కూడా బాక్సాఫీస్ వద్ద అయితే పర్వాలేదు అనిపించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి