ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ విలేకరులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన అను తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. 'అల్లు అర్జున్ తో వర్క్ చేశారు అలాగే అల్లు శిరీష్ తో కూడా కలిసి పనిచేశారు. ఇద్దరిలో క్యూటెస్ట్ ఎవరు..? నాటీ ఎవరు..?' అన్న ప్రశ్నకు బదులిస్తూ.. 'వేరే ప్రశ్నలేవీ లేవా అడగడానికి..? మంచి ప్రశ్నలు అడగండి' అంటూ నవ్వుతూనే కౌంటర్ వేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోందిఇదిలా ఉంటే అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై శిరీష్ స్పందించారు. ఆ వార్తలన్నీ వట్టి పుకార్లనేనని కొట్టిపారేశారు. దీంతో నెట్టింట వైరల్ అవుతోన్న వార్తలన్నీ ఫేక్ అని స్పష్టమైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి