ఇక ఇదిలాఉంటే సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ ఈ కథలో తమ హీరో ఉంటే బాగుంతుందని అనుకుటున్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కాంతారా లాంటి కథ మా ఎన్.టి.ఆర్ కోసం సిద్ధం చేయండి బాసు అని దర్శక నిర్మాతలని అడుగుతున్నారు. కాంతార ఫర్ ఎన్.టి.ఆర్ అనే హ్యాష్ ట్యాగ్ తో నందమూరి ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి పాత్రలో ఒక్కసారి ఎన్.టి.ఆర్ ని ఊహించుకుంటే మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల్లో నవసరాలను పండించగల స్టార్ ఎన్.టి.ఆర్. ఆయన టచ్ చేసిన జోనర్ లు లేవని చెప్పాలి.కాంతారా లాంటి కథ తారక్ తో చేస్తే మాత్రం పాన్ వరల్డ్ సినిమాగా మిగిలిపోతుందని అంటున్నారు. అంతేకాదు ఎన్.టి.ఆర్ కూడా అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్న తారక్ కాంతార లాంటి కథల కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది. కొరటాల శివ తర్వాత ఎన్.టి.ఆర్ లిస్ట్ లో త్రివిక్రం, సుకుమార్ ఉన్నట్టు తెలుస్తుంది. వీటితో పాటుగా ప్రభాస్ లానే బాలీవుడ్ డైరక్టర్స్ తో కూడా ఎన్.టి.ఆర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అదే జరిగితే ఎన్.టి.ఆర్ కూడా నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒకరిద్దరు బాలీవుడ్ డైరక్టర్స్ తారక్ తో చర్చలు జరిపినట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి