యాంకరింగ్ రంగం ద్వారా అద్భుతమైన గుర్తింపును దక్కించుకొని ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న యాంకర్ కం నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పటాస్ అనే కామెడీ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు దక్కించుకొని , ఆ తర్వాత అనేక సినిమా లలో అనేక పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. శ్రీ ముఖి సినిమాలలో ఇతర ముఖ్య పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా , కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలలో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి టీవీ షో లు , సినిమాలు మాత్రమే కాకుండా "ఓ టి టి" షో లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తుంది. 

ఇది ఇలా ఉంటే శ్రీ ముఖి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ అనే క్రేజీ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస టీవీ షో లతో , "ఓ టి టి" షో లతో , సినిమాలతో సమయాన్ని గడుపుతున్న శ్రీ ముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా శ్రీ ముఖి తన ఇన్స్టా  లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో శ్రీ ముఖి అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న లంగా వోని ని ధరించింది. ఈ లంగా ఓణీలో శ్రీ ముఖి అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: