టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో అంటేనే అందులో ఆయన ఏం చెబుతారు, అతిథులతో ఏం చెప్పిస్తారు అనే ఆసక్తి ఉంటుంది. ఇక అందులోనూ అక్కడ వచ్చింది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, సీనియర్ నటి రాధిక.ఇక్కడ ఆ ముగ్గురికంటే ఎక్కువగా బాలయ్యే పాత విషయాలన్నీ నెమరు వేసుకున్నారు, పనిలో పనిగా ఆ ఇద్దరు హీరోల గొడవని మరోసారి హైలైట్ చేశారు.ఇకపోతే లెజెండ్ ఎవరు, సెలబ్రిటీ ఎవరు. 2007లో జరిగిన తెలుగు సినీ వజ్రోత్సవంలో ఈ చర్చ ఇండస్ట్రీలో రచ్చ లేపింది. 

ఇక వజ్రోత్సవ వేదికపైనే సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఇగోలు, కామెంట్లు.. ఇలా అన్నీ అందరికీ తెలిసిపోయాయి. అయితే నటీనటుల మధ్య ఇంత ఇగో ఉంటుందా అని జనం ముక్కున వేలేసుకున్నారు.కాగా  అన్ స్టాపబుల్ షో లో ఆ సంఘటనను మరోసారి గుర్తు చేశారు బాలయ్య.ఇక  లెజెండ్ ఎవరు అని ఇద్దరు హీరోలు ఆ వేదికపై గొడవ పడ్డారని, ఆ గొడవతో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరాకు పడ్డారని చెప్పారు.అయితే  ఆ గొడవతో అసలు కార్యక్రమం నుంచే లేచి వెళ్లిపోదామనుకున్న వైఎస్ఆర్,

కేవలం తనకు సన్మానం చేయాలనే ఉద్దేశంతోనే ఉండిపోయారని అన్నారు. ఇక అలాంటి గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. అయితే రాజశేఖర్ రెడ్డి గొప్పదనం గురించి చెప్పొచ్చు, కానీ ఆ క్రమంలో లెజెండ్ అనే బిరుదుకోసం ఇద్దరు హీరోలు కొట్లాడుకున్నారు, అది చూసి వైఎస్ఆర్ చిరాకు పడ్డారని చెప్పడంతో అన్ స్టాపబుల్ టాక్ షో మరోసారి వార్తల్లోకెక్కింది. ఇక ఇప్పుడే కాదు, గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా వారిద్దరి గురించి బాలయ్య ఇలాగే సెటైర్లు వేశారు.కాగా వజ్రోత్సవ వేదికపై చిరంజీవి, మోహన్ బాబు లెజెండ్ అనే బిరుదుకోసం కొట్టుకోవడం చూశాం కదా అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు బాలయ్య.ఇకపోతే  అన్ స్టాపబుల్ షో లో కూడా ఆ ఇద్దరిపై మరోసారి పంచ్ లు వేసి కలకలం రేపారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: