కృతి శెట్టి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఉప్పెన సినిమా తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.. అమ్మడు అందం,అభినయం జనాల ను ఆకర్షించడం తో అమ్మడుకు వరుస సినిమా అవకాసాలు వస్తున్నాయి. ఇప్పటికీ అమ్మడు అదే జోరు కొనసాగిస్తుంది.. స్టార్ హీరోల సినిమాల లో నటించే ఛాన్స్ ను కొట్టేసింది.. అంతేనా తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాల ను అందుకుని ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది.


వరుసగా మూడు హిట్లు పడేసరికి కృతి శెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో నే కృత్తి శెట్టి నుండి ఎలాంటి న్యూస్ వచ్చిన అభిమానులు వెంటనే సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా కృతిశెట్టి అభిమానుల కోసం మంచి గుడ్ న్యూస్ చెప్పింది . తన అభిమానుల ను డైరెక్ట్ గా మీట్ అవ్వబోతుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కొద్దిసేపటి కితమే తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసింది .


కృతి శెట్టి డిసెంబర్ 2 అనగా ఈ రోజు నెల్లూరు కి వస్తుంది . అన్నమయ్య సర్కిల్ దగ్గరలో ని హోటల్ తేజస్వి గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా కృతి శెట్టి ముఖ్య అతిథిగా హాజరు కాబోతుంది . ఈ విషయాన్ని స్వయానా బేబమ్మనే తన ఇంస్టా స్టోరీ లో రాసుకొచ్చింది . ఈ క్రమంలోనే ఇన్నాళ్లు తెర పై తమ ఫేవరెట్ హీరోయిన్ చూసి ఎంజాయ్ చేస్తున్న కృత్తిశెట్టి ఫ్యాన్స్ .. ఆమెను డైరెక్ట్ గా మీట్ అవ్వడానికి ఇప్పటినుంచే అక్కడ హంగామా చేస్తున్నారు.. నెల్లూరు అన్నమయ్య సర్కిల్ దగ్గర హై సెక్యూరిటీ వాతావరణం నెలకొంది . త్వరలో నే నాగచైతన్య సినిమా తో మనం ముందుకు రాబోతుంది ఈ బేబమ్మ..


మరింత సమాచారం తెలుసుకోండి: