తెలుగు ప్రేక్షకుల కు సంక్రాంతి అంటే నిజం గానే పండగ సమయం. ఎందు కంటే స్టార్ హీరోల సినిమా లన్నీ విడుదల అయ్యేది ఎక్కువ గా సంక్రాంతి సమయం లోనే ఇక 2023 సంక్రాంతి కూడా బోలెడు సినిమాలు విడుదల కి లైన్ లో ఉన్నాయి. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" మరో వైపు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన "వీరసింహారెడ్డి" సినిమాలు సంక్రాంతి సందర్భం గా విడుదల కి సిద్ధమవుతుండ గా మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మొట్ట మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా అయిన "వారసుడు" మరియు అజిత్ డబ్బింగ్ సినిమా "తునివు" కూడా సంక్రాంతి బరి లోనే దిగనున్నాయి. మరో వైపు దిల్ రాజు "వారసుడు" సినిమా కోసమే ఎక్కువ థియేటర్ల ను తీసుకుంటు న్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.

అయితే తాజా సమా చారం ప్రకారం డిస్ట్రిబ్యూటర్లు కూడా విజయ్ సినిమా ని కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాల కంటే "వారసుడు" సినిమా విడుదల చేయడానికి ముందుకు వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం బడ్జెట్ కూడా అని చెప్పుకోవచ్చు. అసలే సంక్రాంతి సమయం మళ్లీ చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు అంటే కచ్చితంగా కలెక్షన్లు ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సినిమా రైట్స్ కూడా ఎక్కువ మొత్తానికి అమ్ముడు అవుతాయి. అయితే అంత భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టకుండా విజయ్ సినిమా తక్కువ మొత్తానికి వచ్చేస్తుంది. పైగా విజయ్ కి కూడా టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. సినిమా డైరెక్టర్ కూడా వంశీ పైడిపల్లి కాబట్టి ఈ సినిమాకి కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే బాలయ్య, చిరు సినిమాల కంటే విజయ్ సినిమా కొనడానికి ఎగ్జిబిటర్లు ముందుకు వస్తున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: