ఒకప్పుడు మంచి హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలన్నీ ఈమధ్య రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.. ఆ సినిమాకు సంబంధించి ఏదైనా పెద్ద విశేషం జరిగినప్పుడు లేదా విడుదలై 10 20 ఏళ్ళు అయినా సినిమాలు మళ్లీ విడుదల చేసి అభిమానులు అలరించడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే చాలా సినిమాలు ఈ ట్రెండ్ ను ఫాలో అయినప్పటికీ ప్రస్తుతం 90లో యువతను ఊర్వత లోగించిన ప్రేమదేశం చిత్రం రీ రిలీజ్ కు అయింది.

90 ల్లో యువతను ఒక ఊపు ఊపిన బ్యూటిఫుల్ మూవీ ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..ముస్తఫ్పా.. ముస్తఫ్ఫా అంటూ స్నేహం విలువ చెప్పిన సినిమా.. నను నేనే విడిచిన నీ తోడూ అంటూ.. ప్రేమ విలువ చెప్పిన సినిమా.. పాతికేళ్ళ క్రితం అప్పటి కుర్రాళ్ళను ఉర్రూతలూగించిన మూవీ ప్రేమదేశం రీ రిలీజ్ కాబోతోంది.

1996లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అప్పటి ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చి, ఒక సంచలనంగా మారింది. కదిర్ దర్శకత్వం వహించిన ఈమూవీ ఎవర్ గ్రీన్ గా నిలిచింది.. అంతే కాదు యూత్ లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.. ఈ సినిమాతోనే టబు తమిళ తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అటు టుబుకి.. అబ్బాస్ కు వినిత్ కు మర్చిపోలేని మెమరీగా నిలవడమే కాకుండా.. వారికి వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది సినిమా.. ఇక ఈ మూవీ పాటల గురించి చెప్పాలంటే.. అవి ఎవర్ గ్రీన్ అనే అనాలి. ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన ఆ పాటలు.. ఇప్పటికీ ఫ్రెష్ ప్లేవర్ ను అందిస్తుంటాయి. ఇప్పటి యూత్ కు కూడా కనెక్ట్ అయ్యేలా ఆ పాటలు కంపోజ్ చేశాడు రెహమాన్.. తమిళంలో కాదల్ దేశం పేరుతో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను వారంలోపే ప్రేమదేశం పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు… ఇక ప్రస్తుతం దాదాపు 25 ఏళ్ళ తరువాత ఈ క్రేజీ లవ్ స్టోరీని.. టెక్నికల్‌గా కొన్ని మార్పులు చేసి.. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు.. ఈ సినిమా కోసం అప్పటి ప్రేమదేశం ఫ్యాన్స్ తో పాటు.. ఇప్పటి యూత్ కూడా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: