మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న తేజ సజ్జ ఇప్పుడు హనుమాన్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న ఈ సినిమా విజువల్ వండర్ అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల అవ్వగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు ఈ యంగ్ హీరో.తొలి చిత్రం జాంబీ.. తీసిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా కావడం గమనార్హం.


ఇకపోతే ప్రశాంత వర్మ ఇదివరకే తేజ పాత్రకు సంబంధించిన విషయాలను గ్లింప్స్ ద్వారా పరిచయం చేశాడు.  తర్వాత పోస్టర్ల ద్వారా ఇతర ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేశాడు. అయితే ఎట్టకేలకు టీజర్ ను కూడా విడుదల చేసి మరొక సంచలనం సృష్టించాడు. అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమవుతుంది. జలపాతం కి ఆనుకొని చేతిలో గధ తో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనం ఇస్తుంది.  ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్లో శ్రీరామనామం వినిపించింది.


ఈ టీజర్ లో సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా తేజా సజ్జ ఎంట్రీ కనిపిస్తుంది.  ఇకపోతే ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా.. వినయ్ రాయ్ , వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా టీజర్ ద్వారా అరుదైన రికార్డు సృష్టించాడు. ఇటీవల విడుదలైన కాంతారా ,కార్తికేయ 2 సినిమాలు హనుమాన్ టీజర్ సినిమాకు మంచి బజ్ ఇచ్చాయి . ఈ సినిమా టీజర్ 50 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ , వన్ మిలియన్ కంటే ఎక్కువ లైక్లను పొందింది.. అంతేకాదు ఇంత అరుదైన రికార్డును కలిగి ఉన్న అతి చిన్న వయసుకుడిగా రికార్డు సృష్టించారు తేజ సజ్జ. ఏది ఏమైనా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రెండవ సినిమాతోనే ఈ రికార్డు సొంతం చేసుకోవడం.

మరింత సమాచారం తెలుసుకోండి: