తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నితిన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపుbను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నితిన్ "మాచర్ల నియోజకవర్గం" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన ఈ మూవీ లో నితిన్  ... సిద్ధార్థ్ రెడ్డి అనే కలెక్టర్ పాత్రలో నటించాడు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో కృతి శెట్టి మరియు కేథరిన్ , నితిన్ సరసన హీరోయిన్ గా నటించగా మహతీ ద్వారా సాగర్ ఈ మూవీcకి సంగీతం అందించాడు. ఈ మూవీ లో నితిన్ తన నటన తో ప్రేక్షకులను ఎంతగానో అలరించినప్పటికీ ,  ఈ మూవీ కథ మరియు స్క్రీన్ ప్లే అంతగా ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోవడంతో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం అలరించ లేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన మాచర్ల నియోజక వర్గం సినిమా ఈ రోజు నుండి అనగా డిసెంబర్ 9 వ తేదీ నుండి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మాచర్ల నియోజకవర్గం మూవీ యొక్క డిజిటల్ హక్కులను జీ 5 "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని ఈ రోజు నుండి జీ 5 "ఓ టి టి"  సంస్థ తెలుగు లో స్ట్రీమింగ్ చేస్తోంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే జీ 5 "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: