
మృణాల్ ఠాకూర్ కు ‘సీతారామం’ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ అయితే పెరిగిపోయింది. ఆ సినిమా కూడా మంచి పేరును తెచ్చుకొని విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే.
ఆమె కోసం దర్శక, నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడిందంటే ఆమె ఎంతటి క్రేజ్ ని సంపాందించుకుందో తెలిసిపోతోందటా.. ‘సీతారామం’ సినిమా విడుదల రోజున ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడిని హగ్ చేసుకొని మరీ ఏడ్చింది. ఈ సినిమా వల్ల ఆమెకు గౌరవం కూడా అమాంతం పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు. తన అందంతో..నటనతో సౌత్ మేకర్స్ ను సైతం ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో యమబిజీగా ఉండడం విశేషం..
‘సీతారామం’ సినిమా తెచ్చిన క్రేజ్ తో ఒక పక్క గ్లామర్ ప్రదర్శన చేస్తూనే మరో పక్క మంచి పాత్రలు వస్తే విడువకుండా ఆ సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. అయితే.. తాజాగా ‘ పిప్పా’ అనే చిత్రం కోసం ఇషాన్ పక్కన హీరోయిన్ గా కాకుండా, చెల్లిగా చేస్తోందటా.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ‘ పిప్పా’ చిత్రం కోసం ఇషాన్ పక్కన హీరోయిన్ గా కాకుండా, చెల్లిగా చేయడం ఏంటని నెటిజనులు ఆమెపై కామెంట్ల రూపంలో ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు తెగ విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.
ఇప్పుడు ఇదే విషయం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఇప్పడు చెల్లిగా నటించి మళ్లీ హీరోయిన్ గా ఎలా చేస్తావు| అని కూడా కామెంట్స్ కూడా పోస్ట్ చేసారు. ఈ ఈ కామెంట్స్ కు మృణాల్ ఠాకూర్ తనదైన శైలిలో సమాధానమిస్తూ.. ” హలో ఫ్రెండ్స్.. చెల్లెలు క్యారెక్టర్ లో నటించకూడదా..? అది నటన కాదా? అలా నటిస్తే అవకాశాలు తగ్గిపోతాయన్నది తప్పు, రూల్స్ బ్రేక్ చేసినప్పుడే మన ప్రతిభ బయటకి అయితే వస్తుంది.
అంతే కాదు ఏ పాత్రలోనైనా నటించి.. ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి. అప్పుడే మనలో టాలెంట్ ఉంది అని భావించాలి అని మృనాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.