టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదలై ఇప్పటికే ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. బాలయ్య సరసన హనీ రోజ్, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఆయన భార్య పాత్రలో నటించి ఎంతగానో మెప్పించింది.మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.అయితే గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాలతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడి చివరికి జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా వచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో మంచి జోరు చూపించిన ఈ సినిమా తర్వాత ఎందుకో జోరు తగ్గించింది.ఎనిమిది రోజుల థియేట్రికల్ రన్ చేసుకున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


ఇక వీర సింహారెడ్డి సినిమా ఫస్ట్ డే 25 కోట్ల 35 లక్షలు వసూలు చేయగా రెండో రోజు 5 కోట్ల 25 లక్షలు, మూడో రోజు 6కోట్ల 45 లక్షలు ఇంకా నాలుగో రోజు 7 కోట్ల 25 లక్షలు, ఐదవ రోజు 6 కోట్ల 25 లక్షలు, ఆరవ రోజు 4 కోట్ల 80 లక్షలు, ఏడవ రోజు 3 కోట్ల 16 లక్షలు ఇంకా అలాగే 8వ రోజు 1 కోటి 53 లక్షలు వసూలు చేసింది. ఇక మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 60 కోట్ల 4 లక్షల షేర్ ఇంకా 97 కోట్ల 10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.ఇక కర్ణాటకతో పాటు  భారతదేశంలో మిగిలిన ఏరియాల్లో ఎనిమిది రోజులకు గాను 4 కోట్ల 55 లక్షలు వసూలు చేయగా ఓవర్సీస్ లో 5 కోట్ల యాభై 5 లక్షలు వసూలు చేసి ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 70 కోట్ల 14 లక్షలు షేర్ ఇంకా అలాగే 117 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ 73 కోట్లు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్  మొత్తం 74 కోట్లు ఉంది. ఇక ఈ సినిమా ఇంకా 3 కోట్ల 86 లక్షలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్  గా నిలుస్తుంది. అయితే ఒక రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ వుంది. ఈ సినిమాతో బాలయ్య మళ్ళీ తన ఫామ్ ని నిలబెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: