ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన సినీ ప్రముఖుల చేత ఎన్నో మన్ననలు పొందింది ఈ సినిమా.ఇక ఇప్పుడు 95వ అస్కార్ అవార్డ్ నామినేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సాంగ్ నామినేట్ అయ్యింది. మంగళవారం నాడు సాయంత్రం విడుదల చేసిన ఆస్కార్ నామినేషన్స్‏లో నాటు నాటు సాంగ్ సెలెక్ట్ అయ్యింది.ఇప్పటికే నాటు నాటు సాంగ్ కి ఫేమస్ ఇంటర్నేషనల్ అవార్డు .. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు లభించింది.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇంకా అలాగే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఏకంగా వరల్డ్ లోనే బిగ్గెస్ట్ అవార్డ్స్ గా పేరు గాంచిన ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలిచింది.


చాలా భాషల నుంచి దాదాపు 300 సినిమాలు షార్ట్ లిస్ట్ కాగా.. అత్యత్తమ ప్రమాణాలను కలిగిన సినిమాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది లిస్టుకి ఎంపిక చేశారు. కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది.ఇంకా అలాగే భారతీయ షార్ట్ ఫిల్మ్స్ 'ఆల్ దట్ బ్రీత్స్', 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' కూడా ఇందులో నామినేట్ అయ్యాయి. అలిసన్ విలియమ్స్ ఇంకా రిజ్ అహ్మద్ వ్యాఖ్యతలుగా ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ లిస్టుని ప్రకటించారు. ఇప్పటికే నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే.అలాగే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ కూడా అందుకుంది. ఇంకా ఇవే కాకుండా జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఈ సినిమాకి అవార్డ్ వచ్చింది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం మార్చి 12 వ తేదీన లాస్‌ ఏంజల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: