టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.చాలా సినిమాలో నటించిన అల్లు అర్జున్ ఆయనను యాక్షన్ హీరోగా మార్చిన సినిమా అయితే బన్నీ సినిమాని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.వి వి వినాయక్ దర్శకత్వంలో తెరగక్కిన ఈ సినిమా అప్పట్లో ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్ ఆయన స్టైల్ ఆయన వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో మనం చూడొచ్చు. 

ఇక ఈ సినిమాలో బన్నీ కి జోడిగా హీరోయిన్ గా గౌరీ  ముంజల్ నటించింది. హీరోయిన్గా తన అందంతో తన నటనతో మంచి మార్కులను కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ సినిమాలో తన క్యూట్ క్యూట్ లుక్స్ తో కుర్రకారుల మది పోగొట్టింది ఈ హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ తెలుగులోనే కాకుండా తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలలో నటించడం జరిగింది. వీటితోపాటు ఒక మలయాళం సినిమాలో కూడా నటించింది. అయితే ఈమె తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలే తెలుగులో నటిస్తూనే కన్నడ సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది గౌరీ.

 ఇకపోతే గౌరీ జగపతి బాబు నటించిన బంగారు బాబు సినిమాలో ఆఖరిగా నటించింది. దాని తర్వాత 2011 నుండి సినిమాలకు దూరమైంది గౌరీ.ఇక తెలుగులో ఈమె శ్రీకృష్ణ 2006 అలాగే గోపి గోడ మీద పిల్లి మరియు భూకైలాస్ వంటి సినిమాలలో నటించడం జరిగింది. అయితే 2011 నుండి తెలుగు సినిమాలలో కనిపించకుండా పోయిన ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూతున్నారు. అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఫోటోలను చూసి చాలామంది షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈమె ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బన్నీ సినిమాలో ఉన్న గ్లామర్ ఇప్పుడు గౌరీ కి లేదు. అంతేకాదు అప్పుడు ఉన్నంత నాజూగ్గా ఇప్పుడు లేకపోవడంతో గౌరీ ఫోటోలు చూసిన చాలామంది నెటిసన్లు షాక్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: