తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మోస్ట్ టాలెంటెడ్ కథానాయకులలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ మూవీ లలో హీరో గా నటించి దేశ వ్యాప్తంగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ స్టార్ హీరో ఆఖరుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... రావు రమేష్ , సునీల్ , అనసూయమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా పుష్ప ది రూల్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. పుష్ప మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగం పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ను జరుపుతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: