సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కాబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. అందుకు సంబంధించి ట్రైలర్ను కూడా విడుదల చేసి అందరిని ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా చిత్రం బృందం నుంచి అప్డేట్ రావడంతో నిరాశ పరిచెలా చేస్తోంది.


ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమా విడుదల కావాల్సి ఉండగా ఆ రోజున సినిమాను ప్రేక్షకులం ఎందుకు తీసుకురాలేకపోతున్నామని చిత్ర బృందం తెలియజేశారు. త్వరలోనే ఒక కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తామని తెలిపారు.శాకుంతలం వాయిదా పడడం ఇది. గత ఏడాది సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి కూడా అదే పని చేయడం జరిగింది.శాకుంతలం సినిమా విడుదల చేయకపోవడానికి సమంతానే కారణమని అందుకే వాయిదా వేశారన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.


సమంత ఆటో వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసింది.. బేడ్ పైన ఉండే యశోద సినిమాకి డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటారని సమంత చెప్పింది కానీ గుణశేఖర్ మాత్రం ఈ సినిమా వాయిదా వేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.అసలు కారణం మాత్రం వేరే ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్తో శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విజువల్ వండర్ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా మిగిలి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అందుచేతనే ఆలస్యంగా వచ్చిన పర్వాలేదు కానీ గ్రాఫిక్స్ చూపించాలని గుణశేఖర్ వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. మరి తెలుగులోపాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: