తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి కొరటాల శివ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రేజీ దర్శకుడు మిర్చి మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత వరుసగా శ్రీ మంతుడు ... జనతా గ్యారేజ్ ... భరత్ అనే నేను మూవీ లతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల వరుసలో చేరిపోయాడు.

ఇలా కెరీర్ లో వరుస విజాయలను అందుకున్న కొరటాల కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది. దానితో ఆచార్య మూవీ తో కొరటాల కు కూడా మొట్ట మొదటి ఫ్లాప్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు. ఆచార్య మూవీ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయడానికి డిసైడ్ అయిన కొరటాలమూవీ ప్రారంభించడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు.

కొంత కాలం క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ అందించనుండడం ... రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనుండడం ... జాన్వి కపూర్ మొట్ట మొదటి సారి తెలుగులో ఈ సినిమాలో నటిస్తూ ఉండడం ... హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లు ఈ మూవీ కోసం పని చేస్తూ ఉండడం ఇలా కొరటాల తన తదుపరి మూవీ కోసం అదిరిపోయే సెటప్ ను చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూసినట్లు అయితే కొరటాలమూవీ తో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునే లాగానే కనిపిస్తుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: