మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా పలు సినిమా లను నిర్మించాడు. కానీ అందులో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. నాగబాబు చివరగా ఆరెంజ్ సినిమాను నిర్మించాడు.

సినిమా డిజాస్టర్ గా నిలవడంతో కలెక్షన్స్ అస్సలు నమోదు కాలేదు. ఆ సినిమా నష్టాల నుండి బయట పడేందుకు గాను నాగబాబుకు ఏకంగా అయిదు సంవత్సరాల సమయం పట్టిందట. పవన్ కళ్యాణ్ కూడా సాయం చేశాడు అంటున్నారు. 

సినిమా తర్వాత డైరెక్ట్ గా ఒక్క సినిమా ను కూడా నాగబాబు నిర్మించలేదు. కానీ ఆయన బ్యానర్ లో కొన్ని సినిమా లు మాత్రం సమర్పించాడు. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఆరెంజ్ మిగిల్చిన ఫలితాన్ని ఆయన మర్చి పోలేక పోతున్నాడు. తాజాగా నాగబాబు తన బ్యానర్ లో ఒక సినిమా ను నిర్మించేందుకు సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తన కొడుకు వరుణ్ హీరోగా ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను కథను ఎంపిక చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఆ కథ విషయం లో నాగబాబు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడని ఆ కథ లో నాగబాబు కూడా కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి నాగబాబు మరియు వరుణ్ తేజ్ కలిసి నటించబోతున్న ఆ సినిమాను స్వయంగా వారే నిర్మించబోతున్నారు. చిన్న బడ్జెట్ చిత్రం అన్నట్లుగా కాకుండా కాస్త భారీ బడ్జెట్ తోనే సినిమాను నిర్మించే ఉద్దేశ్యంతో నాగబాబు ఉన్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం నాగబాబు పలు సినిమా ల్లో నటించడంతో పాటు వ్యాపారాల్లో కూడా ఉన్నాడు. అందుకే ఆయన తన కొడుకు సినిమాను స్వయంగా నిర్మించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన త్వరలో వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: