శరత్ బాబు చాలా మంచి వ్యక్తి అక్కడినుంచి ఇద్దరం ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉండే వాళ్ళము హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు కూడా మాట్లాడాడు నాతో అని చెప్పారు తమ్మారెడ్డి.. ఎక్కువగా ఆయన ఎవరితో మాట్లాడరు తన పని తాను చేసుకుంటూ ఉంటారు.ఆ మధ్య చిరంజీవి పరిశ్రమలో ఎంప్లాయిస్ కోసం..CCC నీ స్టార్ట్ చేసినప్పుడు తనకు ఫోన్ చేసి వివరాలు ఎక్కడ ఎవరికి ఇవ్వాలి అని అడిగారని అతను అంత ఫండ్ డొనేట్ కూడా చేశారు. అలాగే రసీదు కూడా అడిగి తీసుకున్నారని తెలిపారు తమ్మారెడ్డి.శరత్ బాబు చాలా కామన్ గా ఉంటారు. ఎవరు గురించి పట్టించుకోరు... అన్నిటికీ మించి ఒక మంచి నటుడు చాలామంది స్టార్స్ ఎన్టీఆర్ నాగేశ్వరరావు, రజనీకాంత్, కమలహాసన్, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, శివాజీ గణేశ, లాంటి నటులు అందరితో పోటీపడి నటించారు. కానీ ఈరోజు ఆ వ్యక్తి మన మధ్య లేకుండా అనంత లోకాలకు వెళ్లిపోవడం చాలా విచారకరం అంటూ ఆయన ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూరాలని తెలియజేశారు తమ్మారెడ్డి.. శరత్ బాబు చివరిగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటించారు. ఇందులో పవిత్ర లోకేష్, నరేష్ నటించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారి పాత్రలో నటించారు శరత్ బాబు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి