సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే ఈ సెలబ్రిటీలకు సంబంధించిన ఏదైనా వార్త సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లకు సంబంధించి ప్రేమ పెళ్లి విషయాలు ఎప్పుడూ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. సాధారణంగా హీరో హీరోయిన్లు ఇక అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెప్పి.. తమ పెళ్లిని అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇక ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం చేస్తూ ఉంటారు.


 కానీ ఈ విషయం మీడియా చెవిన పడి చివరికి పెళ్లి విషయం కాస్త వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఒక హీరోయిన్ ఇలాగే సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతుందట. హీరోయిన్ సొన్నాలి సెగల్  ప్రస్తుతం పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్యార్ కా పంచనామా మూవీతో ప్రేక్షకులకు దగ్గర అయింది సొన్నాలి సెగల్. ప్రియుడు అశేష్ ఎల్ సజ్నని సీక్రెట్ గా వివాహం చేసుకోబోతుందట ఈ ముద్దుగుమ్మ.  దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా ఈ జంట డేటింగ్ లో కొనసాగుతుంది. కాగా నేడే ఇక ఈ అమ్ముడు పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ఈ పెళ్లికి సన్నిహితులు బంధువులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. అయితే 34 ఏళ్ల సొన్నాలి సెగల్  మే నెల ప్రారంభంలోనే బ్యాచిలర్ పార్టీని ఇచ్చింది. అయితే పెళ్లి గురించి మాత్రం ఎక్కడా చిన్న లీక్ బయటికి రాకుండా జాగ్రత్త పడింది. ఇలా పెళ్లి విషయంపై అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంది అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా డిసెంబర్ లో వీరిద్దరూ  డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రాగా.. ఇక ఈ వార్తలపై ఎవరు స్పందించలేదు. కాగా చివరిగా నటి సొన్నాలి సెగల్ అనామిక అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ప్రస్తుతం నూరాని చెహరా, బ్లాక్ కరెన్సీ అనే ప్రాజెక్టుల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయం తెలిసి అభిమానులు కంగ్రాట్యులేషన్స్ చెబుతుంటే.. మరి కొంతమంది చెప్పకుండా సీక్రెట్ పెళ్లేంటో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: