నాగ చైతన్య తన కెరీర్ లో సోలో హీరో గా నటించిన ఆఖరి ఐదు మూవీ ల క్లోసింగ్ కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రియమణి ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించగా ... అరవింద స్వామి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7.20 కోట్ల కలక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది.

నాగ చైతన్య హీరో గా రాసి కన్నా హీరోయిన్ గా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4.45 కోట్ల కలక్షన్ లను వసూలు చేసి ఫ్లాప్ గా మిగిలింది.

నాగ చైతన్య కొంత కాలం క్రితం లవ్ స్టోరీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా ... టాలెంటెడ్ నటి సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 35.08 కోట్ల కలక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

నాగ చైతన్య కొంత కాలం క్రితం శివ నర్వన దర్శకత్వంలో రూపొందిన మజిలీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 40.23 కోట్ల కలక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

నాగ చైతన్య హీరో గా నిధి అగర్వాల్ హీరోయిన్ గా సవ్యసాచి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 11.17 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: