సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి . అయితే కేవలం సినిమాల గురించి మాత్రమే కాదు అటు పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక మరోవైపు ఎంతో మంది సిరీస్ సెలబ్రిటీలు కూడా ఒకప్పటిలా పర్సనల్ లైఫ్ విషయాలను సీక్రెట్ గా ఉంచుకోకుండా.. సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.



 ఇలా ఎవరైనా సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియని విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు అంటే చాలు అది కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి ఇటీవలే ఒక షాకింగ్ నిజాన్ని బయట పెట్టాడు. ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. మిథున్ చక్రవర్తికి ముగ్గురు కుమారులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆయనకు ఉన్న ఒక్కగానొక్క కూతురు దిశాని చక్రవర్తి. అయితే తన కూతురు దిశాని గురించి ఇటీవల సంచలన విషయాన్ని బయట పెట్టాడు మిథున్ చక్రవర్తి.


 తన కూతురు దిశాని చక్రవర్తి తనకు పుట్టలేదు అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఆమె తన దత్తత పుత్రిక అంటూ తెలిపాడు. కుటుంబ సభ్యులు చిన్నప్పుడే రోడ్డు పక్కన చెత్తకుండీ దగ్గర విడిచిపెట్టి వెళ్తే.. అనుకోకుండా నా కంటపడింది.. ఆ తర్వాత ఆమె పరిస్థితి గురించి తెలుసుకొని.. ఇక దత్తత తీసుకొని కూతురిగా చేరదీశాను అంటూ మిథున్ చక్రవర్తి చెప్పిన విషయం కాస్త సంచలనంగా మారిపోయింది. అయితే బాల్యం నుంచి నటన పట్ల దిశాని చక్రవర్తి ఆసక్తి కలిగి ఉండేది. దీంతో నేను కూడా ప్రోత్సహించాను అంటూ ఒక సమావేశంలో చెప్పుకొచ్చాడు. కాగా 2017లో గిఫ్ట్ అనే హాలీవుడ్ షార్ట్ ఫిలిం ఫిలిం తో నటన ప్రారంభించిన దిశాని.. ది గెస్ట్ ఇన్ 2022 షార్ట్ ఫిలిం తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: